జీవీఎంసీ ఐదవ వార్డ్ లో కుట్టు మిషన్ల శిక్షణా తరగతులు ప్రారంభించిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. డ్వాక్రామహిళా సంఘాల ఏర్పాటు చేసి మహిళలకు పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

మహిళల అభ్యున్నతే మన రాష్ట్ర ప్రగతికి మూలం.. భీమిలి ఎమ్మెల్యే గంటా. (ప్రజా బలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ ) మధురవాడలో మహిళలకు కుట్టు మిషన్ శిక్షణా తరగతులను ప్రారంభించిన గంటా.. మధురవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు శ్రమించే బహుముఖ ప్రజ్ఞాశాలి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు గంటా అన్నారు ఆదివారం.మధురవాడ 5వ వార్డ్ పరిధి మారికవలస సైక్లోన్ సెంటర్ భవనంలో బీసీ కార్పొరేషన్ స్వయంఉపాధి కార్యక్రమంలో మహిళలకు కుట్టు మిషన్ శిక్షణా తరగతులను కార్పొరేటర్ మొల్లి హేమలత తో కలిసి గంటా ప్రారంభించారు.అనంతరం టిడిపి జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు75వ జన్మదిన వేడుకలను అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేశారు. అనంతరం పండ్లు మిఠాయిలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో 5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత, టిడిపి రాష్ట్ర నాయకులు మొల్లి లక్ష్మణరావు,నాగోతి వెంకట సత్యనారాయణ, ఈగల రవికుమార్, బోయి వెంకటరమణ(శ్రీను), నమ్మి శ్రీనివాస్, బోయ రమాదేవి, కొండపు రాజు, ముచ్చి రామనాయుడు, జనసేన అధ్యక్షులు దేవర శివ, ఆనందరావు, గురయ్యా శ్రీను గురయ్యా రెడ్డి, కురుమోజు శ్రీను, టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.