కలం పోటు ఎమ్మెస్సార్ కు ఉగాది పురస్కారం. జర్నలిజానికి వన్నెతెచ్చిన ఎమ్మెస్సార్.

*జర్నలిజంలో అపూర్వ నిబద్ధతకు గౌరవం — ఎమ్మెస్సార్ ప్రసాద్‌కు "ఉగాది పురస్కారం" ....స్వీకరణ* *సుప్రీంకోర్టు 48వ మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ చేతుల మీదుగా అవార్డు స్వీకరణ* తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం (ఆంధ్రప్రదేశ్) ఆధ్వర్యంలో ప్రతీ ఏడాది ప్రముఖ జర్నలిస్టులకు ప్రదానం చేసే "ఉగాది పురస్కారాలు" ఈ సంవత్సరం అత్యంత వైభవంగా జరిగాయి. 2024-25 సంవత్సరానికి జర్నలిజం విభాగంలో విడిజిటల్ న్యూస్ బ్యూరో చీఫ్, సీనియర్ జర్నలిస్టు ఎమ్మెస్సార్ ప్రసాద్ ఈ అవార్డు అందుకున్నారు. విజయవాడ తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో తెలుగు జర్నలిస్ట్ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం లో భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 48వ మాజీ న్యాయమూర్తి ఎన్వి రమణ, ముఖ్య అతిథిగా,ప్రముఖ సినీ నిర్మాత, ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ కంచర్ల అచ్యుతరావు విశిష్ట అతిధిగా హాజరై ఎమ్మెస్సార్ ప్రసాద్‌ ను ఉగాది పురస్కారం తో సత్కరించారు.ఎమ్మెస్సార్ ప్రసాద్ జర్నలిజం పట్ల చూపిన అసాధారణ నిబద్ధత, పాత్రికేయుడిగా చేసిన సమర్పిత సేవలు, వృత్తి ధర్మాన్ని నిలబెట్టే విధంగా చూపిన దృఢత్వం ఆయనను ఈ అవార్డుకు అర్హుడిగా నిలిపాయి. సామాజిక స్పృహతో కూడిన కథనాలు, ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించే విశేష కృషి ఎప్పుడూ ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. ఈ ప్రత్యేకతలే ఈ ప్రతిష్టాత్మక పురస్కారం ఆయనను వరించడానికి కారణమయ్యాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి ఎంపికైన ప్రతిభావంతులందరికీ ఈ ఉత్సవ వేదికపై పురస్కారాలు అందించటం జరిగింది. జర్నలిజంలో నిబద్ధతకు, సమర్పణకు ఇది ఒక గొప్ప గుర్తింపుగా నిలిచింది. ఈ సందర్భంగా ఎమ్మెస్సార్ మాట్లాడుతూ అతిరథ మహారధుల చేతుల మీదుగా అవార్డు స్వీకరించడం అదృష్టం గా భావిస్తున్నానన్నారు. నిర్వాహకులు రంగనాయకులకి, ఇతర అతిరధులకు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ సందర్బంగా ఎమ్మెస్సార్ ప్రసాద్ ను పలు జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు, జర్నలిస్ట్ లు అభినందించారు.