వేసవి దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ పంపిణీ చేస్తున్న సత్యసాయి సేవా సంస్థల సేవకులు. స్వామి వందో సంవత్సరం పుట్టినరోజు వేడుకల్లో రెట్టింపు ఉత్సాహంతో సేవలో పాల్గొంటున్న యువత. మద్దిలపాలెంలో మజ్జిగ సేవ, సత్య సాయి ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లడమే మా బాధ్యత,విశాఖ జిల్లా సత్య సాయి సేవా సంస్థల అధ్యక్షులుపి ఆర్ ఎస్ నాయుడు.
April 15, 2025
భీమిలి నియోజకవర్గం,మధురవాడ జోన్ 2 ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : ( వి. ఎస్ వి.సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను సెల్ నెంబర్, 9502817542)
విశాఖ,ఎం వి పి కాలనీ,,,మద్దిలపాలెం,--భగవాన్ శ్రీ సత్య సాయి దివ్య ఆశీస్సులతో సత్యసాయి సేవా సంస్థలు ఆధ్వర్యంలో విశాఖ జిల్లాలో అన్ని జోన్లలో మజ్జిగ సేవా కార్యక్రమాల ఏప్రిల్ 15 ప్రారంభం జరిగాయి. ఇందులో భాగంగా మద్దిలపాలెం బస్ స్టేషన్ నందు చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి శతజయంతి ఉత్సవాల లో భాగంగా ఈ చలవేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు శ్రీ సత్యసాయి సేవా సంస్థల విశాఖ జిల్లా అధ్యక్షుడు పిఆర్ఎస్ ఎన్ నాయుడు తెలిపారు. ఎండాకాలం నేపథ్యంలో మద్దిలపాలెం బస్ స్టేషన్ ఆవరణలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రం ప్రారంభించా మని పేర్కొన్నారు. ఈ చలివేంద్రం రెండు నెలల కాలం పాటు మే 15 వరకు కొనసాగించడం జరుగుతుందని అన్నారు. యువత కోసం వేద పఠనం, భజన బృందాల ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు కూడా ఆయన తెలిపినారు ఈ కార్యక్రమంలో సిటీ సమితి కన్వీనర్ డి వి వి ఎస్ రాజు, జిల్లా సేవాదళ్ సమన్వయకర్త ఆర్ ఎ నాయుడు, సమితి ఇన్చార్జిలు, సేవాదళ్ సభ్యులు మధురవాడ జోన్ కు చెందిన ఎం వివి సిటీ భజన మండలి బాధ్యులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
-
Newer

Older