మజ్జిగ పంపిణీ చేస్తున్న చంద్రంపాలెం జాతర గట్టుదుర్గాలమ్మ ఆలయ కమిటీ.

చంద్రంపాలెం జాతర గట్టు శ్రీదుర్గాలమ్మ ఆలయంలో విశేష పూజలు, ఆలయం వద్ద ఉన్న చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ! భీమిలి నియోజకవర్గం (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్టు మానం శ్రీను ) మధురవాడ చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వసంత ఋతువు చైత్ర మాసం కృష్ణ పక్షం పంచమి శుక్రవారం సందర్భంగా ఉదయం నిత్య అర్చనలతో ప్రారంభమై కుంకుమార్చన పుష్పార్చన తదితర పూజా కార్యక్రమాలు ఆలయ అర్చకులు పట్నాల మూర్తి శర్మ తదితరులు నిర్వహించి కర్పూర హారతి నీరాజన మంత్ర పుష్పం సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు, సాయంత్రం వేళలో అమ్మవారికి పంచామృత సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి ప్రత్యేకంగా అమ్మవారిని అలంకరించి కుంకుమార్చనలు పుష్పార్చనలు మొదలగు పూజా కార్యక్రమాలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించి కర్పూర హారతి సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ఆలయ ప్రాంగణంలో దీపారాధన సేవా కార్యక్రమాలు నిర్వహించారు, ఈ సందర్భంగా విశాఖ మద్దిలపాలెం వాస్తవ్యులు కామేశ్వరరావు, బాల సంతోషిమాత కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో పులిహోర ప్రసాదం ఏర్పాటు చేయగా అమ్మవారికి నివేదించి అనంతరం భక్తులకు పంపిణీ చేశారు, ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ అమ్మవారి ఆలయం వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో సాయిప్రియా గార్డెన్ వాస్తవ్యులు సంతోష్ కుమార్ గారి కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయంతో ఈరోజు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది, శ్రీదుర్గాలమ్మ అమ్మవారి ఆలయానికి వచ్చిన భక్తులు, ఆలయం ముందు రోడ్ మీదుగా ప్రయాణాలు చేసే బాటసారులు, వాహన చోదకులు ఎండ వేడికి, ఉక్కపోతకు గురైన వారందరూ చలివేంద్రంలో మజ్జిగ సేవించి ఆలయంలో కొంతసేపు సేద తీరిన తరువాత వారి వారి ప్రయాణాలు సాగిస్తున్నారని అన్నారు, మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో మజ్జిగ ధాత సంతోష్ కుమార్ దంపతులు, శ్రీ దుర్గాలమ్మ ఆలయ ధర్మకర్త పిళ్లా చంద్రశేఖర్, గ్రామ పెద్దలు పిళ్లా శ్రీనివాసరావు, ఆలయ కమిటీ అధ్యక్షులు పిళ్లా సూరిబాబు, ఉపాధ్యక్షులు పి.వి.జి‌.అప్పారావు, సెక్రటరీ నాగోతి తాతారావు, కోశాధికారి పిళ్లా శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పోతిన శివ, సభ్యులు బోగవిల్లి రాము, పొట్నూరి హరికృష్ణ, పోతిన పైడిరాజు, కేశనకుర్తి అప్పారావు, ముఖ్య సభ్యులు పిళ్లా పోతరాజు, పిళ్లా అప్పన్న, పిళ్లా తమ్మునాయుడు, యస్.శ్రీను, పోతిన రాంబాబు తదితరులు ఉన్నారు.