చంద్రంపాలెం దుర్గాలమ్మ ఆలయ ఆవరణలో జోరుగా సాగుతున్న మజ్జిగ వితరణ
April 20, 2025
చంద్రంపాలెం జాతర గట్టు శ్రీదుర్గాలమ్మ ఆలయం వద్ద ఉన్న చలివేంద్రంలో
మజ్జిగ పంపిణీ!
విశాఖ సిటీ (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: జర్నలిస్ట్ మానం శ్రీను
మధురవాడ)
చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో పద్మశాలి ఆత్మీయ సేవా సంఘం పి.యం.పాలెం వారి అధ్వర్యంలో కొప్పుల సుందరి, నాగేశ్వరావు దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా వారి
ఆర్థిక సహాయంతో ఆదివారం మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది,
వక్తలు మాట్లాడుతూ బాను సప్తమి ఆదివారం కావడంతో ఎండఘ తీవ్రత, ఉక్కపోతతో బాటసారులు, వాహన చోదకులు, శ్రీదుర్గాలమ్మ అమ్మవారి ఆలయానికి వచ్చిన భక్తులు పడుతున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు, ఈ రోడ్డు మీదుగా ప్రయాణాలు చేసే బాటసారులు, వాహన చోదకులు ఎండ వేడికి, ఉక్కపోతకు గురైన వారు చలివేంద్రంలో మజ్జిగ సేవించి కొంత సమయం ఆలయంలో సేద తీరి ప్రయాణాలు సాగిస్తున్నారని అన్నారు.
మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో శ్రీ దుర్గాలమ్మ ఆలయ కమిటీ అధ్యక్షులు పిల్లా సూరిబాబు సెక్రటరీ నాగోతి తాతారావు, చంద్రంపాలెం గ్రామ పెద్దలు పిళ్లా శ్రీనివాసరావు, కమిటి సభ్యులు పొట్నూరి హరికృష్ణ, ముఖ్య సభ్యులు పిళ్లా పోతరాజు, పొట్నూరి వాసు, ఆలయ అర్చకులు పట్నాల హరిప్రసాద్ శర్మ,
పద్మశాలి ఆత్మీయ సేవా సంఘం అధ్యక్షులు కె.వి.నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ బేతా అప్పన్న కుమార్, కొప్పుల శ్రీధర్ , బి.పాండురంగ విఠలరావు, యమ్ నర్సింగరావు, ఇమంది నాగేశ్వరరావు, అమ్మవారి సేవకులు తదితరులు మజ్జిగ పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్నారు.