చంద్రంపాలెం దుర్గాలమ్మ ఆలయ ఆవరణలో ఆలయ కమిటీ అధ్యక్షుడు పిల్లా సూరిబాబు ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ.
April 21, 2025
చంద్రంపాలెం జాతర గట్టు శ్రీదుర్గాలమ్మ ఆలయం వద్ద ఉన్న చలివేంద్రంలో దాతలు సహాయ సహకారాలతో
మజ్జిగ పంపిణీ!
విశాఖ సిటీ ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ :
(సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ, 9502817542)
మధురవాడ చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో పి.యం.పాలెం కు చెందిన నేమాని అన్విత పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు నేమాని గాంధీ, అనురాధ, పెండిం శంకర్రావు, పద్మావతి గార్ల సౌజన్యంతో
మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది, ఈ సందర్భంగా
శ్రీదుర్గాలమ్మ ఆలయ కమిటీ అధ్యక్షులు పిళ్లా సూరిబాబు మాట్లాడుతూ శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద చలివేంద్రంలో వారానికి రెండు రోజులు మజ్జిగ మిగతా రోజుల్లో స్వచ్ఛమైన చల్లని మంచినీరు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు, కాని ఇక్కడ జరుగుతున్న మజ్జిగ పంపిణీ కార్యక్రమాలను చూసిన దాతలు, భక్తులు మాకు చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ చేయడానికి అవకాశం ఇస్తే, మేము కూడా ఏర్పాటు చేస్తామని చాలా మంది ముందుకు రావడంతో వారానికి మూడు లేదా నాలుగు రోజులు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు, సోమవారం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో, బాటసారులు, వాహన చోదకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని చలివేంద్రంలో మజ్జిగ సేవించి సేద తీరుతున్నారని అన్నారు,
మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో శ్రీ దుర్గాలమ్మ ఆలయ కమిటీ అధ్యక్షులు పిల్లా సూరిబాబు సెక్రటరీ నాగోతి తాతారావు, కమిటి సభ్యులు పోతిన పైడిరాజు, బోగవిల్లి రాము, పొట్నూరి హరికృష్ణ, ముఖ్య సభ్యులు పిళ్లా పోతరాజు, పొట్నూరి వాసు, సుందర శ్రీను, పోతిన రాంబాబు, ఆలయ అర్చకులు పట్నాల హరిప్రసాద్ శర్మ,
పద్మశాలి ఆత్మీయ సేవా సంఘం అధ్యక్షులు కె.వి.నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ బేతా అప్పన్న కుమార్, సోర్నపూడి గణేష్, యన్. షణ్ముఖరావు, బి.పాండురంగ విఠలరావు, యమ్ నర్సింగరావు, ఇమంది నాగేశ్వరరావు, జిక్కిలింకి గణపతిరావు తదితరులు మజ్జిగ పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్నారు.
.