పీఎం పాలెం ఎస్సై భాస్కర్కు స్పెషల్ రివార్డ్. అందజేసిన విశాఖ నగర సిపి.
April 24, 2025
పి ఎమ్ పాలెం ఎస్ ఐ భాస్కర్ కి కి స్పెషల్ రివార్డు.
( భీమిలి నియోజకవర్గం, మధురువాడ, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ :సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను)
ఓబాధితురాలిని చాకచక్యంగా ఆసుపత్రికి తరలించి, సకాలంలో చికిత్స అందజేసి, బాధితురాలిని కాపాడిన సిబ్బందికి ప్రత్యేకముగా సత్కరించి , రివార్డ్ మంజూరు ఆర్డరును గురువారం నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి అందజేశారు. అందులో భాగంగా పి.ఎం పాలెం పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటనలో 112 ద్వారా సమాచారం అందుకున్న కే. భాస్కర రావు, ఎస్.ఐ, ఎస్. విజయ్ కుమార్ హెచ్.సి లు తక్షణం సంఘటన జరిగిన ప్రదేశానికి చేరుకొని పరిస్థితులను గమనించి , అంబులెన్స్ రావడానికి మరింత సమయం అవుతుందని గ్రహించి, తక్షణం సదరు హెచ్.సి ,ఎస్.ఐ లు అక్కడ అందుబాటులో ఉన్న ద్విచక్ర వాహనంపై బాధితురాలిని సకాలంలో ఆసుపత్రికి తరలించారు., చికిత్స అందజేసిన బాధితురాలిని రక్షించిన విషయం విధితమే సదరు సంఘటనలో ఉత్తమ విధులు నిర్వహించిన ఇద్దరికి సిపిగారు ప్రత్యేకముగా సత్కరించి , రివార్డ్ మంజూరు ఆర్డరును అందజేయడం జరిగినది.
పి.ఎం పాలెం పోలీసు స్టేషన్ పరిధిలో మరో కేసులో కుటుంబ గొడవలు కారణముగా, ఆత్మహత్యచేసుకోవడం కోసం ప్రమాదకర పరిస్థితులలో ఉన్న వివాహిత మహిళను, రక్షించిన కేసులో మరోమారు కే.భాస్కర రావు, ఎస్.ఐ రివార్డ్ మంజూరు ఆర్డరును అందజేసారు.