ఘనంగా సత్య సాయి ఆరాధన దినోత్సవం. ఎం వివి సిటీ సత్యసాయి సెంటర్లో అక్కడ బాధ్యులు రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేకమైన పూజలు.

విశాఖ సిటీ (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ సెల్ నెం..9502817542) భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామివారి 14వ ఆరాధన దినోత్సవం (సత్యసాయి నిర్యాణం ) గురువారం పీఎం పాలెం క్రికెట్ స్టేడియం ఆపోజిట్, ఎంవీవి సిటీ సత్య సాయి సెంటర్ నందు సాయి భక్తులు అందరితో ఉదయం 4 45 నిమిషాల నుండి ఓంకార సుప్రభాతం నగర సంకీర్తన, 10 గంటలకి నామ సంకీర్తన, 11 గంటలకు ఎం వి వి సిటీ లో సెక్యూరిటీ గార్డ్స్ లకు, అన్ని బ్లాకులలో పనిచేస్తున్న వర్కర్లకు, క్లబ్ హౌస్ లో పనిచేస్తున్న వర్కర్లకు స్వామివారి ప్రసాదంగా లడ్డు, అరటిపండు, స్వామి వారి ఫోటో, విభూది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భీమిలి దగ్గర్లో ఉన్న దొర తోట యందు మన కుటుంబం చారిటబుల్ ట్రస్ట్ నందు నిరాశ్రయులైన పిల్లలకు (విద్యార్థులకు) భోజన సదుపాయం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంలో ఎంవివి సిటీ సాయి సెంటర్ నిర్వాహకులు టంకాల జ్యోతి శివాజీ రామి నాయుడు, నాగవేణి వెంకట రామకృష్ణారావు అధిక సంఖ్యలో సాయి భక్తులు పాల్గొన్నారు..