విశాఖ, మధురవాడ,చంద్రంపాలెం జాతర గట్టు దుర్గాలమ్మ ఆలయం వద్ద పద్మశాలి ఆత్మీయ సేవా సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ.
April 13, 2025
చంద్రంపాలెం జాతర గట్టు శ్రీదుర్గాలమ్మ ఆలయం వద్ద ఉన్న చలివేంద్రంలో పద్మశాలి ఆత్మీయ సేవా సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ!
భీమిలి నియోజకవర్గం, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ :( సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను )
మధురవాడ చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఉన్న చలివేంద్రంలో పద్మశాలి ఆత్మీయ సేవా సంఘం పి.యం.పాలెం వారి అధ్వర్యంలో తీడ తులసి రామ్ కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయంతో మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది, శ్రీదుర్గాలమ్మ అమ్మవారి ఆలయానికి వచ్చిన భక్తులకు, ఎండ వేడిమితో ప్రయాణాలు చేసే బాటసారులకు, వాహన చోదకులకు మజ్జిగ పంపిణీ చేసి దాహార్తి తీర్చడం జరిగింది, మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పద్మశాలి ఆత్మీయ సేవా సంఘం సెక్రటరీ భేతా భాస్కరరావు , కోశాధికారి పొన్నగంటి నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ కొప్పుల శ్రీధర్, బేతా అప్పన్న కుమార్, పప్పు రామస్వామి, కాధూరి శ్రీరాములు, సోర్ణపూడి షణ్ముఖ, ఇమంది నాగేశ్వరరావు,
ఆలయ ధర్మకర్త పిళ్లా చంద్రశేఖర్, ఆలయ కమిటీ అధ్యక్షులు పిళ్లా సూరిబాబు, సభ్యులు నాగోతి తాతారావు, సభ్యులు బోగవిల్లి రాము, బంక వాసు, పొట్నూరి హరికృష్ణ, పోతిన పైడిరాజు, గ్రామ పెద్దలు పీస రామారావు, ముఖ్య సభ్యులు పిళ్లా పోతరాజు, పిళ్లా అప్పన్న, పోతిన gj రాంబాబు ఆలయ అర్చకులు పట్నాల మూర్తి శర్మ తదితరులు ఉన్నారు.