చంద్రంపాలెం జాతర గట్టు దుర్గాలమ్మ ఆలయ ప్రాంగణంలో ఘనంగా సీతారామ కళ్యాణం
April 06, 2025
చంద్రంపాలెం జాతర గట్టు శ్రీదుర్గాలమ్మ ఆలయ ప్రాంగణంలో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం
విశాఖపట్నం... ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం
శ్రీను మధురవాడ
మధురవాడ చంద్రంపాలెం జాతర గట్టు శ్రీదుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో క్షేత్ర పాలకుడుగా ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం ఎదురుగా ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం శ్రీ దుర్గాలమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు,
ముందుగా ఆదివారం ఉదయం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి నిత్య పూజలతో పాటు పంచామృత సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, అలంకరణ, అనంతరం సింధూర అర్చన, నాగవళ్లి ధళార్చన మొదలగు పూజా కార్యక్రమాలు నిర్వహించారు , అనంతరం శ్రీ సీతారాముల ఉత్సవ విగ్రహాలను పల్లకిలో పుర వీధుల్లో ఊరేగించి పల్లకి సేవ నిర్వహించారు,
శ్రీనివాస్, దమయంతి దంపతులు, రామకృష్ణ , విశాలాక్షి దంపతులు, నిశాంత్ రంజాన్, ఉషా శ్రీవల్లి దంపతులు, నాగోతి హరికృష్ణ, లావణ్య దంపతులు కళ్యాణంలో పాల్గొన్నారు,
ఆలయ అర్చకులు కళ్యాణ సంకల్పంతో ప్రారంభమై జీలకర్ర బెల్లం, మంగళ సూత్ర ధారణ, తలంబ్రాలు, తదితర కళ్యాణ కార్యక్రమాలు నిర్వహించి అనంతరం శ్రీరామ పట్టాభిషేకం తదితర కార్యక్రమాలు ఆలయ అర్చకులు పట్నాల హరిప్రసాద్ శర్మ, హరి స్వామి తదితరులు నిర్వహించారు,
మధురవాడ వాస్తవ్యులు చిలుకూరి సత్య శ్రీనివాస్, కాశీ అన్నపూర్ణమ్మ దంపతులు కుమారులు చిలుకూరి సంతోష్ గారి సహాయ సహకారాలతో ఏర్పాటు చేసిన కళ్యాణ విందు (అన్నసంతర్పణ) ఏర్పాటు చేయడం జరిగింది,
ఈ కార్యక్రమంలో సుమారు నాలుగు వేల మంది భక్తులు కళ్యాణంలో పాల్గొని వీక్షించి కళ్యాణ తలంబ్రాలు తల పై వేసుకొని తీర్ధ ప్రసాదాలు అన్న ప్రసాదాలు స్వీకరించారు,
ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పిళ్లా చంద్రశేఖర్ ఆలయ కమిటీ అధ్యక్షులు పిళ్లా సూరిబాబు ఉపాధ్యక్షులు పి.వి.జి.అప్పారావు, యస్.యన్.మూర్తి, సెక్రటరీ నాగోతి తాతారావు కోశాధికారి పిళ్లా శ్రీనివాసరావు, ఉప కోశాధికారి దుక్క వరం, జాయింట్ సెక్రటరీ పిళ్లా మోహన్ శివకృష్ణ, కమిటీ సభ్యులు పిళ్లా వెంకటరమణ పోతిన పైడిరాజు, బోగవిల్లి రాము, పొట్నూరి హరికృష్ణ, పిళ్లా రమణ, పోతిన శివ, బంక వాసు, మరుపిల్లి ఆనంద్, పిళ్లా రాజు, కేశనకుర్తి అప్పారావు, పిళ్లా సన్యాసిరావు, దుర్గాశి సోంబాబు, పిళ్లా సన్యాసిరావు, నాగోతి అప్పలరాజు, యస్.ఆర్.బాబు, పిళ్లా శ్రీను, చంద్రంపాలెం గ్రామ పెద్దలు పిళ్లా శ్రీనివాసరావు, పిళ్లా సత్యన్నారాయణ, పీస రామారావు, బి.సత్యన్నారాయణ, బోగవిల్లి నాని, జగుపిల్లి నాని, పోతిన కృష్ణ, కోన అరవింద్, ముఖ్య సభ్యులు పిళ్లా కృష్ణమూర్తి పాత్రుడు, జగుపిల్లి అప్పలరాజు, పిళ్లా పోతరాజు, పి.వి.రమణమూర్తి, పి.వెంకటరమణ, పిళ్లా రాము, జగుపిల్లి అప్పారావు, పోతిన అచ్చియ్యపాత్రుడు, యం.వెంకటరావు, పిళ్లా అప్పన్న, అప్పారావు, పిళ్లా బంగార్రాజు , యస్.శ్రీను, యస్.రమేష్, జి.కామేశ్వరరావు, పి. వాసు, బి.అప్పలరాజు, పి.గురునాధ్ తదితరులు పాల్గొన్నారు
ఈ శ్రీరామనవమి సందర్భంగా గురుశ్రీ నృత్యాలయ ఆధ్వర్యంలో డాన్స్ టీచర్ టీచర్ ఝాన్సీ రాణి, దివ్యవాణి బృందం వారిచే కూచిపూడి నృత్యం, సూర్యనారాయణ మాష్టారు ఆధ్వర్యంలో భక్తి గీతాలతో భజన తదితర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.