చంద్రపాలెం జాతర గట్టు దుర్గమ్మ ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు పిల్లా సూరిబాబు పర్యవేక్షణ లో మజ్జిగ పంపిణీ...

చంద్రంపాలెం జాతర గట్టు శ్రీదుర్గాలమ్మ ఆలయ ప్రాంగణంలో ఉన్న చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ. ( భీమిలి నియోజకవర్గం, ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను ) విశాఖపట్నం జిల్లా మధురవాడ చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో గత వారంలో ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే, చలివేంద్రంలో సోమవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది, మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ అధ్యక్షులు పిల్లా సూరిబాబు, సెక్రటరీ నాగోతి తాతారావు, ఉప కోశాధికారి దుక్క వరం, కమిటీ సభ్యులు పోతిన పైడిరాజు, పోతిన శివ, పిళ్లా రాజు, పొట్నూరి హరికృష్ణ, చంద్రంపాలెం గ్రామ పెద్దలు పిళ్లా శ్రీనివాసరావు, పీస రామారావు, పిళ్లా సత్యన్నారాయణ, ముఖ్య సభ్యులు పిళ్లా పోతరాజు, జగుపిల్లి అప్పారావు, పొట్నూరి వాసు, పిళ్లా రాజు, పి.రాంబాబు పాల్గొన్నారు, ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఎండలు రోజు రోజుకీ పెరగడంతో ఎండలో ఉక్కపోత తో ఆటోలలో, బైకులపై, నడక దారిలో ప్రయాణం చేసేవారికి, అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఉపశమనం కలగడం కోసం చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుందని, వారంతా ఇక్కడ మజ్జగ సేవించి కాసేపు ఆలయంలో సేదతీరి అనంతరం వారి ప్రయాణాలు సాగిస్తున్నారని అన్నారు.