చెత్తను తొలగిస్తున్న దెందులూరు ఎమ్మెల్యే. చింతమనేని.

స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ దెందులూరు (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను. మధురవాడ) చిత్తశుద్ధితో చెత్తను తొలగించిన. - 5గంటల పైగా నియోజకవర్గంలో ఏకధాటిగా స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించిన దెందులూరు ఎమ్మెల్యే. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అందరికీ ఆదర్శం -శనివారం ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు దెందులూరు మండలంలోని సోమవారప్పాడు నుంచి పెదవేగి మండలంలోని వేగివాడ వరకు దాదాపు 15కిలోమీటర్ల మేర రహదారి స్వచ్ఛత కార్యక్రమాన్ని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నిర్వహించారు. స్వయంగా ఎమ్మెల్యే చెత్తను సేకరిస్తూ మరోవైపు భారీ స్థాయిలో పేర్కొన్న చెత్తను జెసిబి యంత్రాల ద్వారా తొలగించడంతోపాటు, తొలగించిన చెత్తను కూడా ట్రాక్టర్ల ద్వారా చెత్త సేకరణ కేంద్రాలకు పంపించేలాగా అన్ని ఏర్పాట్లు చేశారు. - దీంతో స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ చూపిస్తున్న అంకిత భావంతో స్ఫూర్తి పొందిన పలువురు కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారులు సైతం మరింత చొరవ చూపి చెత్త సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం అయ్యారు. స్వచ్ఛత కార్యక్రమ లక్ష్యం అమలుపై నిర్లక్యం ప్రదర్శించిన వేగివాడ నాయకులు, స్థానిక పంచాయతీ అధికారుల తీరుపై దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేసారు - ప్రభుత్వ కార్యక్రమాల అమలులో దెందులూరు నియోజకవర్గ పరిధిలో ఎవరైనా సరే ఉదాసీనత వ్యవహరిస్తే వారిని ఉపేక్షించం అంటూ హెచ్చరించారు. 48గంటల్లోగా వేగివాడ పంచాయతీ పరిధిలోని రహదారి మొత్తం శుభ్రం చేయకపోతే చర్యలు తీసుకుంటామని ఆదేశించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చేయడంతో పాటు పరిశుభ్రం చేయడం కూడా ప్రధమ కర్తవ్యం గా భావించి ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని, ఈ కార్యక్రమాన్ని దెందులూరు నియోజకవర్గం లో పూర్తిస్థాయిలో అంకితభావంతో అమలు చేస్తున్నామని తెలిపారు. దెందులూరు నియోజకవర్గం మొత్తాన్ని కూడా పరిశుభ్రం చేయడం కోసం ఇకపై స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నెలలో మూడవ శనివారం మాత్రమే కాకుండా, ఇకపై ప్రతి శనివారం నియోజకవర్గంలో నిర్వహించేలాగా చర్యలు చేపడతామని, నియోజకవర్గం మొత్తం పరిశుభ్రమ్ అయిన తర్వాత తిరిగి నెలలో ఒక రోజుకు ఈ కార్యక్రమాన్ని అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పరిశుభ్రమైన ప్రాంతాల్లో తిరిగి మళ్ళీ చెత్త పేరుకుపోవడం వంటివి జరిగితే సంబంధిత శాఖ అధికారులను వివరణ కోరుతూ షోకాజ్ నోటీస్ కూడా జారీ చేస్తామని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అటు కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారులు ప్రతి ఒక్కరు కూడా పూర్తి అంకితభావంతో కృషి చేయాలని, కేవలం ఫోటోలకు వార్తల వరకు పని చేస్తే సరిపోవని, ఏ కార్యక్రమం అమలు జరిగినా సరే దెందులూరు నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ కూడా పూర్తిస్థాయిలో భాగస్వామ్యం కావాలని , కార్యక్రమాల లక్ష్యాలను సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దెందులూరు నియోజకవర్గ పరిధిలోని మండల పార్టీల అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జిలు, సీనియర్ నాయకులు తో పాటు కూటమి నాయకులు , కార్యకర్తలు, ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు, సహా వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది ప్రజలు స్వచ్ఛందంగా కార్యక్రమంలో పాల్గొన్నారు..