మానవసేవే మాధవ సేవ. ఎంవిపి వాసవి క్లబ్ కపుల్ అధ్యక్షుడు రామకృష్ణ
April 25, 2025
విశాఖ సిటీ( ప్రజాబలం న్యూస్ ఆన్లైన్: సీనియర్ జర్నలిస్ట్ మానం శ్రీను మధురవాడ)
పెదవాల్తేరు, దళాయి వారి వీధి నందు IRCS నిర్వహణలో పురుషుల నిరాశ్రయులైన వసతి గృహమునందు వాసవి క్లబ్ ఎంవిపి కపుల్స్ఆధ్వర్యంలో కీర్తిశేషులు గోగుల పార్వతి జ్ఞాపకార్థం వారి కుమార్తె క్లబ్
సభ్యులు కాపుగంటి పద్మగారి సహకారంతో వయోవృద్ధులకు అల్పాహారము (బ్రేక్ ఫాస్ట్) ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు వాసవియన్ వెంకట రామకృష్ణారావు, ప్రధాన కార్యదర్శి వాసవియన్ వెంకటరమణమూర్తి, కోశాధికారి వాసవియన్ చంద్రశేఖర్ గుప్తా, చార్టర్ ప్రెసిడెంట్ చెరుకు కృష్ణ మరియు క్లబ్ సభ్యులు వాసవియన్స్
కే శ్రీనివాసరావు,
పి హరగోపాల్, కే నర్సింగరావు పాల్గొన్నారు