శిల్పారామం జాతర గట్టు దుర్గాలమ్మ ఆలయ ఆవరణలో మజ్జిగ పంపిణీ. ఆలయ కమిటీ అధ్యక్షుడు పిల్లా సూరిబాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మజ్జిగ చలివేంద్ర o, అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు.
April 27, 2025
చంద్రంపాలెం జాతర గట్టు శ్రీదుర్గాలమ్మ ఆలయంలో అమావాస్య సందర్భంగా పూజా కార్యక్రమాలు,
భీమిలి నియోజకవర్గం, (ప్రజాబలం న్యూస్ ఆన్లైన్ : సీనియర్ జర్నలిస్టు మానం శ్రీను )
ఆలయం వద్ద ఉన్న చలివేంద్రంలో చల్లని మజ్జిగ పంపిణీ!
మధురవాడ చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వసంత ఋతువు చైత్ర మాసం కృష్ణ పక్షం అమావాస్య ఆదివారం సందర్భంగా శ్రీదుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో మరియు పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఉదయం నుండి పూజా కార్యక్రమాలు ఆలయ అర్చకులు పట్నాల హరిప్రసాద్ శర్మ, మూర్తి శర్మ తదితరులు నిర్వహించారు, ఈ పూజా కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని ఆలయంలో ఉన్న దేవతామూర్తులను దర్శించుకొని ఆలయ ప్రాంగణంలో దీపారాధనలు చేసి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు,
శ్రీదుర్గాలమ్మ ఆలయం వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో పద్మశాలి ఆత్మీయ సేవా సంఘం పి.యం.పాలెం సంఘ సభ్యులు ఉద్దండం కృష్ణారావు కుమారులు ఉద్దండం వరహాలరావు కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన మజ్జిగను విజయనగరం జిల్లా భోగాపురం MEO మీసాల రమణమూర్తి ముఖ్య అతిథిగా హాజరై ఆదివారం మజ్జిగ పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు,
శ్రీదుర్గాలమ్మ అమ్మవారి ఆలయానికి వచ్చిన భక్తులు, రోడ్ల పై ప్రయాణాలు చేసే బాటసారులు, వాహనదారులు ఎండ వేడికి, ఉక్కపోతకు గురైన వారందరూ చలివేంద్రంలో చల్లని మజ్జిగ సేవించి ఆలయంలో కొంతసేపు సేద తీరిన తరువాత వారి వారి ప్రయాణాలు సాగిస్తున్నారు,
మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో శ్రీదుర్గాలమ్మ ఆలయ కమిటీ అధ్యక్షులు పిళ్లా సూరిబాబు, సెక్రటరీ నాగోతి తాతారావు, సభ్యులు పొట్నూరి హరికృష్ణ, పోతిన పైడిరాజు, పోతిన రాంబాబు
పద్మశాలి ఆత్మీయ సేవా సంఘం అధ్యక్షులు కొప్పుల నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ బేతా ఆప్పన్న కుమార్, కె.శ్రీరాములు,
యన్.షణ్ముఖరావు, కె.నాగేశ్వరరావు, ఇ.నాగేశ్వరరావు, బడిగంటి పాండురంగ విఠల్, యమ్.నర్సింగరావు, యు.శ్రీనివాసరావు, యు.నారాయణరావు, గుప్త తదితరులు పాల్గొన్నారు.